సైబర్‌ నేరాల కట్టడికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాల కట్టడికి చర్యలు

Jul 24 2026 7:19 AM | Updated on Jul 24 2026 7:19 AM

ఎస్పీ స్నేహ మెహ్ర

అనంతగిరి: సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రతి పోలీస్‌ అధికారి, సిబ్బంది బాధ్యతగా పని చేయాలని ఎస్పీ స్నేహ మెహ్ర సూచించారు. గురువారం నగరం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా డీజీపీ సీవీ ఆనంద్‌ అన్ని జిల్లాల ఎస్పీలతో సైబర్‌ నేరాల నియంత్రణ, దర్యాప్తులో పురోగతి, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించి సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో సైబర్‌ నేరాల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే బాధితులకు సత్వర సహాయం అందేలా చర్యలు తీసుకోవా లని సిబ్బందికి సూచించారు. కేసుల దర్యాప్తు లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వి నియోగించాలన్నారు. అనుమానాస్పద బ్యాంక్‌ లావాదేవీలు, ఆన్‌లైన్‌ మోసాలు, ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.

స్పోర్ట్స్‌ స్కూల్‌కు

చెల్లాపూర్‌ విద్యార్థిని

కుల్కచర్ల: రాష్ట్ర స్థాయి లో స్పోర్ట్స్‌ స్కూల్‌కు జరిగిన ఎంపిక పరీక్ష లో చెల్లాపూర్‌ ప్రాథ మిక పాఠశాల విద్యార్థిని కోస్గి హరిప్రియ ఎంపికై ంది. ప్రస్తుతం బాలిక 3వ తరగతి చదువుతోంది. ఇటీవల జరిగిన పోటీల్లో ప్రతిభ చాటి ఎంపికై ంది. విద్యార్థిని హరిప్రియను హెచ్‌ఎం ఆనంద్‌కుమార్‌, ఉపాధ్యాయులు సంతోష, శ్రీనివాసులు, దస్తయ్య అభినందించారు.

పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ

బొంరాస్‌పేట: తండాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శేరి రాజేశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఏనెమీది తండాలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి గురువారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నర్సింలుగౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ జయకృష్ణ, సర్పంచ్‌ సోమ్లానాయక్‌, సీనియర్‌ నాయకుడు భీంరెడ్డి, తండా పెద్దలు పాల్గొన్నారు.

కార్పొరేట్‌కు దీటుగా గురుకులాలు

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌

హుడాకాంప్లెక్స్‌: కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా గురుకులాలను ప్రభుత్వం తీర్చిదిద్దిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ పేర్కొన్నారు. సరూర్‌నగర్‌లోని విక్టోరి యా మెమోరియల్‌ హోమ్‌ రెసిడెన్షియల్‌ స్కూ ల్‌లో గురువారం ‘యంగ్‌ ఇండియా స్టూడెంట్‌ కిట్‌, అమెనిటీస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రోగ్రాం’ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతోపాటు అవసరమైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. వీఎం హోంలో చదివే క్రీడాకారులు జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని అభినందించారు. నీట్‌లో సరూర్‌నగర్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కాలేజీ విద్యార్థులు సత్తా చాటి మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎస్‌సీడీడీ కార్యదర్శి విజయేందిర బోయి, వీఎం హోం సెక్రటరీ సల్మాభాను, రోడ్లు, భవనాల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు దేప భాస్కర్‌రెడి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement