కుల్కచర్ల: ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర ఆలయ కమిటీ చైర్మన్‌గా గ్రామానికి చెందిన కోట్ల మైపాల్ రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాంబండ ఆలయ అభివృద్ధికి రూ.30 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. త్వరలో నిధులు మంజూరు కానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బాల నర్సయ్య, సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కుల్కచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో, చౌడాపూర్‌లో రైతు వేదికలో ఆయా మండలాల అధికారులు, సర్పంచులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్పంచ్‌లు పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ రామకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, వైస్ చైర్మన్ అశోక్‌కుమార్, ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ రామ్మోహన్‌శర్మ, కాంగ్రెస్ పార్టీ కుల్కచర్ల మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, చౌడాపూర్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


