తాండూరు/యాలాల: కాంగ్రెస్ ఓట్లను కాపాడుకుందామని, ఇందుకోసం బీఎల్‌ఏలు బాధ్యతగా పని చేయాలని పీసీసీ సర్ పర్యవేక్షకుడు కోటం వినయ్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వచ్చేలా చూడాలన్నారు. గురువారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్ ప్రక్రియపై బీఎల్‌ఏలు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజా బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, సర్ తాండూరు కన్వీనర్ కరణం పురుషోత్తంరావు, పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజ్, తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా నిర్వహించాలి
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సూచించారు. గురువారం యాలాల మండలం చెన్నారం గేటు వద్దగల అనిల్‌కుమార్ గార్డెన్‌లో పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ అధ్యక్షతన బీఎల్‌ఏలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది రోజుల్లో సర్ ప్రక్రియపూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పీసీసీ సర్ పర్యవేక్షకులు వినయ్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు, నియోజకవర్గ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు శివయ్య, ఉపసర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు వెంకటయ్య, సర్పంచ్‌లు అమర్‌నాథ్‌రెడ్డి, నరేష్‌కుమార్, అనిల్‌కుమార్, శ్రీవాణి, నాగమణి, రుక్మిణి, బీ బ్లాక్ అధ్యక్షుడు అనిల్‌కుమార్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేశం, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు భీమప్ప, నాయకులు హన్మంతు, మధుసూదన్‌రెడ్డి, కలాల్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


