అంబులెన్సులో ప్రసవం | - | Sakshi
Sakshi News home page

అంబులెన్సులో ప్రసవం

Jul 4 2026 9:34 AM | Updated on Jul 4 2026 9:34 AM

అంబులెన్సులో ప్రసవం

తల్లీబిడ్డ క్షేమం

తాండూరు రూరల్‌: అంబులెనుల్లో ఓ మహిళ ప్రసవించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దేముల్‌ మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన సోను నిండు గర్భిణి. శుక్రవారం సాయంత్రం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కి ఫోన్‌ చేశారు. వారు తాండూరులోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మంబాపూర్‌ సమీపంలో నొప్పులు అధికమవడంతో డాక్టర్‌ మనీష్‌ సూచనల మేరకు ఈఎంటీ సంజీవ్‌ కాన్పు చేశారు. దీంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను పట్టణంలోని మాతాశిశు ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement