రేవంత్‌రెడ్డి సర్కార్ రైతుల మేలు కోరే ప్రభుత్వం. బీఆర్‌ఎస్ సర్కార్ ఈ ప్రాంతంలో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫార్మాసిటీ ఏర్పాటైతే ఈ ప్రాంతం సర్వనాశనం అయ్యేది. ఫార్మాసిటీని రద్దు చేసి ప్రపంచ స్థాయిలో గుర్తింపునిచ్చేలా ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తున్నాం. వివాదంలో ఉన్న 2,200 ఎకరాల పట్టా రైతులకు ఊహించని విధంగా మేలు చేస్తాం. రైతుల మేలు కోసం రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డితో వెళ్లి ముఖ్యమంత్రిని కలుస్తాం.
–మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం


