రేడియల్‌ రోడ్డుకు భూములిస్తాం | - | Sakshi
Sakshi News home page

రేడియల్‌ రోడ్డుకు భూములిస్తాం

Jul 4 2026 9:34 AM | Updated on Jul 4 2026 9:34 AM

రేడియల్‌ రోడ్డుకు భూములిస్తాం

కొందుర్గు: గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డు–2 నిర్మాణం కోసం భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకారం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్‌ నారాయణ రెడ్డిని కలిసి ఒప్పందపత్రం అందజేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని స్వాగతిస్తున్నామని, అలాగే తమను ఆదుకోవాలని కోరారు. రైతులకు ఎకరానికి రూ.42 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ కోరారు. ఎకరం భూమికి రూ. 40 లక్షలు ఇవ్వడంతోపాటు భూమి కోల్పోయే రైతుకు 120 గజాల ప్లాటును అదే గ్రామంలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసి ఇవ్వనున్నట్టు తెలిపారు. పొలాల్లో ఉన్న చెట్లు, పండ్లతోటలు, పశువుల పాకలు, ఇళ్లు, బోర్లు, పైపులైన్లకు అదనంగా పరిహారం ఇస్తామన్నారు. దీంతో రైతులు భూములు ఇవ్వడానికి ఒప్పుకొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, సర్పంచ్‌లు అంజయ్య, శ్రీనివాస్‌ రెడ్డి, నర్సింలు, నాయకులు జితేందర్‌ రెడ్డి, నర్సింలు, యాదయ్య పాల్గొన్నారు.

అంగీకారం తెలిపిన రైతులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement