అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం

Jul 4 2026 9:34 AM | Updated on Jul 4 2026 9:34 AM

బొంరాస్‌పేట: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పాలన అందిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎనుముల తిరుపతిరెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో రూ.2.80 కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలు, పలు అభివృద్ధి పనులను శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. మెట్లకుంట గ్రామంలో గ్రామ పంచాయతీ నూతన కార్యాలయం, బీసీ కమ్యూనిటీ హాల్‌, బురాన్‌పూర్‌లో పాఠశాల అదనపు తరగతి గదులు, అంగన్‌వాడీ కేంద్రం, కూబ్యానాయక్‌ తండాలో అంగన్‌వాడీ కేంద్రాలు, బొంరాస్‌పేట జీపీఎస్‌, చౌదర్‌పల్లిలో ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించారు. చిన్నారులు, విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ శేరి రాజేష్‌రెడ్డి, ఎంఈఓ హరిలాల్‌, నాయకులు నర్సింలుగౌడ్‌, రాంచంద్రారెడ్డి, మల్లేశ్‌, జయకృష్ణ, అంజిల్‌రెడ్డి, నర్సింలు నాయుడు, అంబయ్య గౌడ్‌, సీహెచ్‌ఎం రవీందర్‌గౌడ్‌, హెచ్‌ఎం లక్ష్మి, సర్పంచులు వీరేశం, ఉమాదేవి, శాంతిబాయి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తిరుపతిరెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement