నామినేటెడ్‌పై నజర్!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులపై పలువురు నేతలు కన్నేశారు. అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగియడంతో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏళ్ల తరబడి పార్టీ బలోపేతం కోసం కష్టపడుతూ, ఆస్తులను సైతం త్యాగం చేసిన నేతలు ఈ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. వీటిని దక్కించుకునేందుకు సన్నిహిత మంత్రులు, ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలతో పైరవీలు షురూ చేశారు. ఇప్పటికే జిల్లాకు మూడు పదవులు దక్కాయి. తాజాగా మరికొన్ని కార్పొరేషన్లకు, కమిషన్లకు చైర్మన్లను నియమించే అవకాశం ఉండటంతో సామాజిక సమీకరణాలు, స్థానిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ పదవులను కట్టబెట్టే అవకాశం ఉంది. దీంతో ఎవరికి వారు వ్యక్తిగత పైరవీలు ప్రారంభించినట్లు సమాచారం.
ఆశావహుల ఆశలు తీరేనా!
రాష్ట్రంలో పలు కీలక కమిషన్లు, కార్పొరేషన్లకు చైర్మన్ల పదవీకాలం ముగియబోతోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు సహా పదవీకాలం ముగిసిన వారి స్థానంలో కొత్త వాళ్లను నియమించేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించగా జిల్లాకు మూడు పదవులు దక్కాయి. వీటిలో రోడ్డు డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టును మల్‌రెడ్డి రాంరెడ్డికి కేటాయించగా, పట్టణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని, జిల్లా పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు మరో కార్పొరేషన్ పదవిని కట్టబెట్టింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో తాజాగా మరో 15 నుంచి 20 కార్పొరేషన్లు, కమిషన్లకు చైర్మన్లు నియమించాలని భావిస్తోంది. దీంతో ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న వారిలో మళ్లీ ఆశలు మొలకెత్తుతున్నాయి.
పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే యత్నం
గాంధీ భవన్ పరిశీలనలో
మరికొందరి పేర్లు


