అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్‌కు అవకాశం వచ్చేనా? | - | Sakshi
Sakshi News home page

అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్‌కు అవకాశం వచ్చేనా?

Mar 1 2026 8:42 AM | Updated on Mar 1 2026 8:42 AM

అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్‌కు అవకాశం వచ్చేనా?

అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్‌కు అవకాశం వచ్చేనా?

సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి బీసీ నేతలకు ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. వీరిలో ఆమనగల్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ చైర్మన్‌, మైసిగండి ఎంపీటీసీ మాజీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన కుటుంబం నాలుగు తరాలుగా హస్తం పార్టీనే నమ్ముకుని పని చేస్తోంది. ఆయన 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ సహా సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డికి, ఎంపీ మల్లు రవికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉంది. ఇప్పటికే రెండు కార్పొరేషన్లు రెడ్లకు దక్కగా సామాజిక సమీకరణలో భాగంగా ఈ సారి బీసీ నేతలకు ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించారు. ఇదే జరిగితే ఆయనకు ఏదో ఒక కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. టీీపీపసీసీలోని కీలక నేతలతో పాటు స్థానిక ఎమ్మెల్యే సైతం ఇప్పటికే ఆయన పేరును ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement