బైక్‌ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం
ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన శనివారం ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన ప్రకారం.. ఇబ్రహీంపట్నం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన భర్తకి శోభన్‌బాబు(52) బైక్ పై నాగన్‌పల్లి నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆక్టోపస్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రామైంది. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శోభన్‌బాబు ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధు లు నిర్వర్తిస్తున్నాడు. కేసు నమో దు చేసిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.
ఆర్టీసీ డ్రైవర్ మృతి


