టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే టీఆర్‌ఆర్
పరిగి: టెట్ నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో కోరారు. టెట్ పరీక్ష లేని సమయంలో ఉపాధ్యాయ పరీక్ష రాసి విధుల్లో చేరానని తెలిపారు. ఇప్పుడు అన్ని రకాల సబ్జెక్ట్ పరీక్షలు రాసి ఉత్తీర్ణత కావాలని ఎన్‌సీఆర్‌టీ చెప్పడంతో ఉపాధ్యాయులకు సమస్యగా మారిందని సభ దృష్టికి తెచ్చారు. టెట్ నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని సూచించారు.


