విద్యతోనేసమాజంలో గుర్తింపు
డీఈఓ రేణుకాదేవి
పరిగి: విద్యార్థులు ఇప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటి సాధన దిశగా అడుగు లు వేయాలని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి సూచించారు. మంగళవారం పట్టణంలోని భవిత కేంద్రం భవప నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకొని మంచి మార్కు లు తెలచ్చుకోవాలని సూచించారు. విద్యతోనే సమాజంలో గుర్తింపు వస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ గోపాల్, ప్రధానోపాధ్యాయురాలు లావణ్య, ఏఎస్‌ఓ రజిని తదితరులు పాల్గొన్నారు.
భవన నిర్మాణాలకు
స్థలం కేటాయింపు
ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ ప్రతీక్ జైన్
కొడంగల్: దుద్యాల్ మండలం పోలేపల్లి, హకీంపేట గ్రామాల్లో ప్రభుత్వం సేకరించిన భూముల్లో భవన నిర్మాణా పనులకు స్థలాలు కేటాయిస్తూ కలెక్టర్ ప్రతీక్ జైన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే నంబర్లు 67, 243, 244, 247, 252తో కలుపుకొని 224 ఎకరాల 4 గుంటలను కేటాయించారు. ప్రభు త్వ మెడికల్ కళాశాలకు 15 ఎకరాల 49 సెంట్లు, జనరల్ ఆస్పత్రికి 22 ఎకరాల 24 సెంట్లు, మహిళా డిగ్రీ కళాశాలకు 3.14 ఎకరాలు, ఇంజనీరింగ్ కళాశాలకు 7.29 ఎకరాలు, వెటర్నరీ కళాశాలకు 27.19 ఎకరాలు, సైనిక్ స్కూల్‌కు 11.69 ఎకరాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రెటే డ్ స్కూల్‌కు 20 ఎకరాలు, ఫైర్ స్టేషన్‌కు ఎక రా, పోలీస్‌స్టేషన్‌కు ఎకరా, ఏటీసీ (ప్రభుత్వ డిగ్రీ కళాశాల) 3.14 ఎకరాలు, అతిథి గృహానికి ఎకరా, సబ్ స్టేషన్‌కు 1.89 ఎకరాలు, కామన్ ఏరియా (గ్రౌండ్, లాన్, ఓపెన్ థియేటర్, రోడ్లు, ఇతర అవసరాలకు) 114.20 ఎకరాలు మంజూరు చేశారు. ఇలా మొత్తం 224. 04 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.
కొడంగల్ ఏఓగా శ్రీలత
కొడంగల్: మండల వ్యవసాయాధికారిగా శ్రీలత మంగళవారం విధుల్లో చేరారు. ఇక్కడ పనిచేస్తున్న తులసీ దౌల్తాబాద్ మండలానికి బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో శ్రీలత ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, పంట ఉత్పాదకత పెంపు, వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తానని అన్నారు.
వికారాబాద్‌లో భారీ వర్షం
అనంతగిరి: వికారాబాద్ మండలంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరపి లేకుండా పడింది. దీంతో ఆయా గ్రామాల్లోని పలు రోడ్లు జలమయంగా మారాయి. ప్రజలు, వ్యాపారులు ఇబ్బంది పడ్డారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యం
ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవాబుపేట: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామన్నారు. చించల్‌పేట జెడ్పీహెచ్‌ఎస్‌లో రూ.46 లక్షలతో అదనపు గదుల నిర్మాణ పనులకు, మూలమాడ, కుమ్మరిగూడ, మాదారం గ్రామాల్లో రూ.20 లక్షల చొప్పున గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు.. నవాబుపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో రూ.54 లక్షలతో అదనపు గదులు, మాదిరెడ్డిపల్లిలో రూ.20 లక్షలతో ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తిమ్మరెడ్డిపల్లిలో రూ.10 లక్షల సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో పీఆర్ డీఈ మాధవరెడ్డి, ఏఈ ప్రణీత్, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, ఎంపీడీఓ అనురాధ, డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత, మాజీ సర్పంచలు వెంకట్‌రెడ్డి, ఎండీ రఫీ, బల్వంత్‌రెడ్డి, ప్రభాకర్, విజయలక్ష్మి, నాయకులు మల్లారెడ్డి, నాగిరెడ్డి, ఎక్‌బాల్, కదీర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యతోనేసమాజంలో గుర్తింపు
విద్యతోనేసమాజంలో గుర్తింపు


