● దేవుడి దయతో బతికిపోయాం | - | Sakshi
Sakshi News home page

● దేవుడి దయతో బతికిపోయాం

Nov 5 2025 9:14 AM | Updated on Nov 5 2025 9:14 AM

● దేవుడి దయతో బతికిపోయాం

● దేవుడి దయతో బతికిపోయాం

● దేవుడి దయతో బతికిపోయాం

తాండూరు రూరల్‌: దేవుడి దయతో బతికిపోయాం అని చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ప్రాణాలతో బయటపడిన తల్లి పుష్పలత, కూతురు క్రిస్టినా పేర్కొన్నారు. పెద్దేముల్‌ మండలం కందనెల్లి గ్రామానికి చెందిన పుష్పలత కొన్నేళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి తాండూరులో నివాసం ఉంటోంది. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. పుష్పలతకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స కోసం కూతురు క్రిస్టినాతో కలిసి సోమవారం ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. అఖరి సీట్లో ఇద్దరూ కూర్చున్నారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో బస్సు అదుపుతప్పింది. ‘నేను కిందపడ్డాను. కంకర పొగ వల్ల నా కూతురు కనిపించలేదు. నడుములోతు కంకర ఉంది. మమ్మీ, మమ్మీ అంటూ క్రిస్టినా ఏడుపు వినిపించింది. వెంటనే కూతురి కాళ్ల కింద ఉన్న కంకరను తొలగించా. ఆ తర్వాత ఎడమవైపు కిటికీలోంచి బ్యాగులు బయటకు విసిరేసి దూకేశాం. లిఫ్ట్‌ అడిగి వికారాబాద్‌కు వచ్చాం. అక్కడి నుంచి ఆటోలో తాండూరుకు చేరుకున్నాం’ అని పుష్పలత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement