● వీధినపడ్డ డ్రైవర్ దస్తగిరి కుటుంబం
బషీరాబాద్: బస్సు స్టీరింగ్ పట్టి కుటుంబాన్ని నడిపిన డ్రైవర్ దస్తగిరి మృతితో కుటుంబసభ్యులు దిక్కులేని పక్షులయ్యారు. మీర్జాగూడ బస్సు దుర్ఘటనలో దస్తగిరి దుర్మరణం చెందడంతో అతడి ఇద్దరు భార్యలు, పిల్లలు, వృద్ధురాలైన తల్లి శోకసంద్రంలో మునిగిపోయారు. మొదటి భార్య రెండున్నరేళ్లుగా పిల్లలతో కలిసి యాలాల మండలం చెన్నారంలో తల్లి ఖాజాబీతో కలిసి ఉంటోంది. దస్తగిరి పెద్ద కొడుకు ఆహ్మద్ హైమద్ జినుగూర్తి మైనార్టీ గురుకులంలో ఆరో తరగతి చదువుతుండగా, చిన్న కొడుకు చెన్నారంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. దస్తగిరి కొన్నాళ్లుగా రెండో భార్య సాజిదాబేగం, తల్లి షౌకత్‌బేగంతో కలిగి తాండూరు మాణిక్‌నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అతడి అంత్యక్రియలు సోమవారం రాత్రి నిర్వహించారు.
మంచాన పడ్డ తల్లి షౌకత్‌బేగం
రెండో భార్య సాజితాబేగం
● వీధినపడ్డ డ్రైవర్ దస్తగిరి కుటుంబం
● వీధినపడ్డ డ్రైవర్ దస్తగిరి కుటుంబం


