● తల్లిలేని పిల్లలయ్యారు
తాండూరు: బస్సు ప్రయాణం నా భార్యను దూరం చేస్తుందనుకోలేదు. ముగ్గురు చిన్నారులు తల్లిలేని పిల్లలుగా మారారని మృతురాలు తబస్సుమ్ జహాన్ భర్త మహమ్మద్ మాజిద్ కంటతడి పెట్టుకున్నారు. తబస్సుమ్‌కు బీపీ ఉండటంతో నగరంలోని ఓ డాక్టర్ వద్ద అపాయింట్‌మెంట్ తీసుకున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలు మహమ్మద్ మాజిన్, మెహ్‌విష్ జహాన్, ఐదేళ్ల కుమారుడు ముక్రమ్‌తో కలిసి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ బస్సు ఎక్కాడు. ఆడవారికి కేటాయించిన సీట్లతో భార్య, కొడుకు ముక్రమ్ కూర్చున్నారు. పక్క సీట్లో నేను మరో ఇద్దరు పిల్లలు కూర్చున్నాం. వికారాబాద్ దాటాక ఇద్దరు పిల్లలు నిద్రపోయారు. తల్లి వద్ద కూర్చున్న ముక్రమ్ ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు తన వద్దకు వచ్చి ఒడిలో కూర్చున్నాడు. తర్వాత జరిగిన ప్రమాదంలో తబస్సుమ్ మరణించింది. మేము ప్రాణాలతో బయటపడ్డాం. స్థానికులు రక్షించారు. డాక్టర్ అపాయింట్‌మెంట్ 9 గంటలకు ఉండటంతో ఫస్ట్ బస్సులో బయలుదేరాం.


