
ఏఐతో విద్యా ప్రమాణాలు మెరుగు
దోమ: విద్యార్థుల ప్రమాణాలు పెంపునకు కృత్రిమ మేధ(ఏఐ) విద్య ఎంతో దోహదపడుతుందని కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి(సీఎంఓ) రజిని, జీసీడీఓ(గర్‌ల్స్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్) శ్రీదేవి అన్నారు. మండల పరిధిలోని బొంపల్లి ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న వేసవి తరగతులను శనివారం ఎంఈఓ వెంకట్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కంప్యూటర్ ద్వారా విద్యార్థులు అందిపుచ్చుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అడిగి తెలుసుకున్నారు. చదవడం, రాయడం, సంఖ్యాపరమైన విజ్ఞానాన్ని పెంపొందించడం, వ్యక్తిగతంగా విద్యార్థుల ప్రమాణాలు, అభ్యసనా సామర్థ్యాలను మెరుగుపర్చడం వంటివి దగ్గరుండి పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. ఈ సమయంలో ఎలాంటి అనుమానాలు అడిగినా వెంటనే నివృత్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి.వెంకటయ్య, వలంటీర్ అఖిల్, అభిలాష్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
సీఎంఓ రజిని, జీసీడీఓ శ్రీదేవి
కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి రజిని, జీసీడీఓ శ్రీదేవి
బొంపల్లిలో విద్యార్థులు నేర్చుకుంటున్న ఏఐ విద్య పరిశీలన