
కార్మికులపై చిన్నచూపు తగదు
తాండూరు టౌన్: అసంఘటిత రంగ కార్మికులపై ప్రభుత్వం చిన్నచూపు తగదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ అన్నారు. అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కరించాలనే డిమాండ్‌తో మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పోలీసులు పలువురు సీఐటీయూ, పీడీఎస్‌యూ నా యకులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. భవన నిర్మా ణ, బీడీ కార్మికులు, ట్రాన్స్‌పోర్టు హమాలీలు, సె క్యూరిటీ గార్డులు తదితర అసంఘటిత రంగంలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వం వెంటనే కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డి మాండ్ చేశారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల మే నిఫెస్టోలో 15 శాతం విద్యారంగ పటిష్టానికి నిధు లు కేటాయిస్తామని చెప్పి ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం 7.57 శాతం నిధులు మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. విద్య, కార్మిక రంగ సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో పీడీఎస్‌యూ సభ్యులు ప్రకాశ్, నవీన్ ఉన్నారు.
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్