ఖమ్మం సభను విజయవంతం చేద్దాం
కొడంగల్ రూరల్: సీపీఐ శతాబ్ది ముగింపు సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పీర్ మహమ్మద్, నియోజకవర్గ నాయకు డు గంటి సురేష్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివా రం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు జిల్లాలోని పారీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాబు,సావిత్రమ్మ, శ్యామప్ప, మల్కప్ప, శంకర్‌నాయక్, శైలజ, కనకప్ప పాల్గొన్నారు.


