నిరాధార ఆరోపణలు సరికాదు
కొడంగల్ రూరల్: ధూప దీప నైవేద్య పథకం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవశర్మపై నిట్టూరి సతీష్‌కుమార్ చేసిన నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నట్లు డీడీఎన్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లోకూర్తి జయతీర్థాచారి తెలిపారు. శనివారం పట్టణంలోని శ్రీ మహాదేవుని ఆలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్చకుడే కాని సతీష్‌కుమార్ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకోవడం సరికాదన్నారు. వాసుదేవశర్మ నాయకత్వంలో డీడీఎన్‌ఎస్ అర్చకులు పనిచేస్తున్నట్లు తెలిపారు. అర్చకుల బాగోగుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో అర్చక సంఘం నాయకులు కిట్టుస్వామి, జగదీష్ స్వామి, భానుప్రకాష్, హన్మంతు, శివకుమార్, డీ నర్సింలు, జీ నర్సింలు, జీ శ్రీను, కిష్టప్ప పాల్గొన్నారు.


