విధులకు వెళ్లిన భర్త విగతజీవిగా.. | - | Sakshi
Sakshi News home page

విధులకు వెళ్లిన భర్త విగతజీవిగా..

Oct 16 2026 10:34 AM | Updated on Oct 16 2026 10:34 AM

● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం ● లక్ష్మీపురంలో తీరని శోకం

● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం ● లక్ష్మీపురంలో తీరని శోకం

వరదయ్యపాళెం: మండలంలోని లక్ష్మీపురంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి డ్యూటీకని వెళ్లి తిరిగి రాని లోకాలకు చేరుకున్నాడు. వివరాలు.. వరదయ్యపాళెం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన యు.రమణయ్య(45) శ్రీసిటీలోని ఓ కంపెనీలో సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. రెక్కల కష్టాన్ని నమ్ముకుని, నిత్యం క్రమం తప్పకుండా విధులకు వెళ్లే రమణయ్య గురువారం కూడా యథావిధిగా మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటి వద్ద భోజనం చేసి బీ షిఫ్ట్‌ విధులకు బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ భార్యా పిల్లలకు చెప్పి వెళ్లాడు. అరగంటలోనే విషాదం చోటు చేసుకుంది. బత్తలవల్లం చెక్‌ పోస్ట్‌ సమీపంలో ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడి నుంచి శ్రీసిటీ ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణం విడిచాడు. విషయం తెలుసుకున్న భార్య, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. శ్రీసిటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement