గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Oct 16 2026 10:34 AM | Updated on Oct 16 2026 10:34 AM

నవోదయలో ప్రవేశానికి గడువు పొడిగింపు

బుచ్చినాయుడుకండ్రిగ: బతుకు దెరువు కోసం ద్విచక్ర వాహనంపై వెళ్లుతూ గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన అరిగిలకండ్రిగ గ్రామం వద్ద కేటీ రోడ్డుపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. మండలంలోని కుక్కంబాకం గ్రామానికి చెందిన వెంకటరమణ (38) లారీ డ్రైవర్‌. నాయుడుపేటలో వరి ధాన్యం లోడింగ్‌ చేసుకునేందుకు కుక్కంబాకం గ్రామం నుంచి గురువారం ఉదయం 5 గంటలకు వెంకటరమణ ద్విచక్ర వాహనంపై బయలు దేరారు. శ్రీకాళహస్తి మార్గ మధ్యంలోని అరిగిలకండ్రిగ గ్రామం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో వెంకటరమణకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటరమణకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపారు.

పిడుగుపాటుతో ఎద్దు మృతి

బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని వీఎస్‌పురం గ్రామ పంచాయతీ పరిధిలోని వేణుగోపాలపురం గ్రామానికి చెందిన రైతు చిట్టిబోయిన మునిరామయ్యకు సంబంధించిన ఎద్దు గురువారం పిడుగు పాటుతో మృతి చెందింది. పొలాల వద్ద రెండు ఎద్దులను మేపుతుండగా వర్షంతోపాటు పిడుగులు పడడంతో ఒక ఎద్దు మృతి చెందింది. దీని విలువ రూ.70 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

హంతుకులను

కఠినంగా శిక్షించండి

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: తమ కుమారుడు ప్రవీణ్‌కుమార్‌ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బాధి తల్లి సరస్వతమ్మతో పాటు గిరిజన సంఘాల జేఏసీ నేత చందమామల కోటయ్య డిమాండ్‌ చేశారు. ప్రెస్‌క్లబ్‌లో వారు మీడియాతో మాట్లాడారు. పాకాల మండలం, ఆగిరిపల్లి మధిర పులివర్తిన వారిపల్లె సమీపంలో తమకు మామిడి తోట ఉందన్నారు. సి ప్రవీణ్‌కుమార్‌ గత 15 ఏళ్లుగా ఆ తోట దగ్గరకు వెళ్లి వస్తుండేవాడని చెప్పారు. అయితే మార్చి 2, 2026న తన కుమారుడు హత్యకు గురయ్యాడని తెలిపారు. వెంటనే పాకాల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. దీని వెనుక తమ కోడలు వనితకుమారి, ఆమె మేనమామ సహదేవ్‌ పై అనుమానం ఉందని వారిని కఠినంగా శిక్షించాలని వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

పేలుడు పై విచారణ

తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్‌): తొట్టంబేడు మండలంలోని ఇయా కంపెనీలో బాయిలర్‌ పేలి ప్రమాదం చోటుచేసుకుందన్న కథనంపై తొట్టంబేడు తహసీల్దార్‌ భారతి, ఎస్‌ఐ బాలకృష్ణ స్పందించారు. గురువారం కంపెనీ ప్రాంగణాన్ని పరిశీలించారు.

తిరుపతి అర్బన్‌: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2027–2028 విద్యాసంవత్సరానికి 9, 11 తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువును ఈనెల 22వ తేదీ వరకు పొడిగించినట్లు కోచింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి గురువారం తెలిపారు. జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాల కోసం 2027 ఏప్రిల్‌ 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం: 86888 88802, 93999 76999 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement