చంద్రబాబు ప్రభుత్వంలో దళితుల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది. ఆయన కు దళితుల పట్ల చులకన భావం ఎక్కువ. అప్పుడప్పు డు ఆయన పార్టీ వారితో దళి తులపై దాడులు చేయించి శునకానందం పొందు తుంటారు. దళితులు తిరిగబడితే ప్రభుత్వం కూలిపోతుందన్న నగ్న సత్యాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. – నల్లాని బాబు, వైఎస్‌ఆర్ సీపీ
ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
దళితుల జోలికి వస్తే తాట తీస్తాం
టీడీపీ గూండాల ఆగడా లు శృతి మించుతున్నాయి. దళితులు ఏం పాపం చేశార ని దాడులు చేస్తున్నారు. పదిమందికి మంచి చేయడానికి వచ్చిన దళితులపై బరితెగించి దాడి చేస్తారా..? మీ పతనం ఆరంభమైంది. దళితుల జోలికి వస్తే ఎవ్వరినైనా తాట తీస్తాం. చంద్రబాబు ప్రభుత్వం దళిత వ్యతిరేకి ప్రభుత్వం. – కోటూరు ఆంజనేయులు,
వైఎస్‌ఆర్ సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు
దళితులకు బతికే హక్కు లేదా?
కూటమి ప్రభుత్వంలో దళితులకు అందరితో సమానంగా బతికే హక్కు లేదా? అన్యాయాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా? చంద్రబాబు ప్రభుత్వం వస్తే దళిత జాతి భయపడే పరిస్థితి. దళితులు కన్నెర్రజేస్తే నీ కుర్చీ కూలడం ఖాయం. దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయకుంటే పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తాం. – జయకర్, ఎంపీటీసీ,
గాంధీపురం, తిరుపతి రూరల్
దళితులంటే చంద్రబాబుకు గిట్టదు
చంద్రబాబు అధికారం కోసం మాయమాటలు చెప్పి నమ్మిస్తారు. తర్వాత దళితులను దూరం పెడతా రు. దళిత బిడ్డలను అంతం చేస్తారు. దళితులకు చదువులను దూరం చేస్తారు. అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు లేకుండా తన పార్టీ గూండాలతో దాడులు చేయిస్తారు. ఆయనకు దళితులంటే గిట్టదు.
– ప్రేమ్‌కుమార్, ఎస్వీయూ వైఎస్‌ఆర్ సీపీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు


