ప్రభుత్వాధికారి భూమాయ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాధికారి భూమాయ

Feb 27 2026 4:09 AM | Updated on Feb 27 2026 4:09 AM

ప్రభు

ప్రభుత్వాధికారి భూమాయ

● దేవరకొండ రెవెన్యూ గ్రామంలో భూదందా ● నోటీసులు జారీ

ఎస్పి కుటుంబం ఆక్రమించిన భూమి

అడిగేవారు లేరని.. అడ్డుకునేవారు రారని ఓ ప్రభుత్వాధికారి అటవీ, ప్రభుత్వ భూములను ఆక్రమించేశారు. ఏకంగా కంచె వేసుకుని సాగు చేస్తున్నాడు. తోటలు పెంచుతూ ఆదాయం పొందుతున్నాడు. ఇందుకు స్థానిక పచ్చనేతలు అండదండలు ఉండడమే కారణం.. అయితే బాపట్ల నుంచి టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి పెంచడంతో ఎట్టకేలకు సర్వే చేసి, ఆ ప్రభుత్వాధికారికి నోటీసులు జారీ చేశారు.

భాకరాపేట : చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ రె వెన్యూ గ్రామంలో జిల్లాస్థాయి పోలీస్‌ అధికారి కు టుంబం విలువైన అటవీ ప్రభుత్వ భూమిని ఆక్రమించి కంచె వేసినా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఈ నేపథ్యంలో బాపట్ల టీడీపీ నాయకులు భూ ఆక్రమణలపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో చిన్నగొట్టిగ ల్లు మండల తహసీల్దార్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఆక్రమణకు గురైన భూములను సర్వే చేశారు. సర్వే నంబర్‌ 638 లో 0.36 ఎకరాలు, 687/1 లో 1.51 ఎకరాలు, 687/2 1.92 ఎకరాలు, 687/4లో 0.60 ఎకరాలు, 688/2 లో 2.80 ఎకరాలు, 689/2 లో 2.60 ఎకరాలు, 689/1 లో 1.04 ఎకరాలు, 689/3 లో 0.88 ఎకరాలు మొత్తం 11.71 ఎకరాల రెవెన్యూ భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. ఇంకా అటవీ శాఖ అధికారులు అటవీ భూములను తేల్చాల్సి ఉంది.

ప్రభుత్వ భూమిని పొందేందుకు అర్హత ఉందా?

ఆ కుటుంబంలో తండ్రి పంచాయతీరాజ్‌ శాఖలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేశారు. కుమారుడు బాపట్ల జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. ఈ కుటుంబానికి ప్రభుత్వభూమిని పొందే అర్హత లేదు. అయి నా ప్రభుత్వ భూమి రెండు ఎకరాలు పట్టా పొంది దాని చుట్టూ ఉన్న ప్రభుత్వ, అటవీ భూములను ఆక్రమించి చుట్టూ కంచె వేసి అటువైపు కనీసం పశువులను సైతం రానీలేదు. ఇందుకు కూటమి నేతల సహకారమే కారణంగా తెలుస్తోంది.

నోటీసులు జారీ

బాపట్ల నుంచి టీడీపీ నేతలు ఒత్తిడి పెంచడంతో చంద్రగిరి నియోజకవర్గ కూటమి నేత మిన్నకుండాల్సి వచ్చింది. ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు భూ ఆక్రమణకు సంబంధించి పరిశీలించి ఎస్పీ కుటుంబానికి నోటీసులు జారీ చేశారు.

నోటీసులతో సరిపెడతారా ?

భూ ఆక్రమణను అడ్డుకోగలుగుతారని స్థానికులు చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ అధికారుల సహకారంతో తమ ప్రాంతంలో ప్రభుత్వ, అటవీ భూములు ఆక్రమణల కు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా ఫిర్యాదులు అందిన వెంటనే బి నాగమ్మకు నోటీసులు ఇచ్చామని తహసీల్దార్‌ భాగ్యలక్ష్మి తెలిపారు. రికార్డులు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రభుత్వాధికారి భూమాయ1
1/2

ప్రభుత్వాధికారి భూమాయ

ప్రభుత్వాధికారి భూమాయ2
2/2

ప్రభుత్వాధికారి భూమాయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement