ఇంటర్‌ పరీక్షకు 454 మంది గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షకు 454 మంది గైర్హాజరు

Feb 27 2026 4:09 AM | Updated on Feb 27 2026 4:09 AM

ఇంటర్

ఇంటర్‌ పరీక్షకు 454 మంది గైర్హాజరు

తిరుపతి సిటీ: ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో భాగంగా గురువారం జరిగిన ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–2 పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఆర్‌ఐఓ జి రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జన రల్‌, ఒకేషనల్‌ గ్రూప్‌లకు సంబంధించి 454 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. జిల్లా వ్యాప్తంగా జనరల్‌ విద్యార్థులకు 84 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఇంగ్లిష్‌ పరీక్షకు 28,395 మందికిగాను 27,968 మంది హాజరయ్యారని తెలిపారు. అలాగే ఒకేషనల్‌ కోర్సు విద్యార్థులకు 14 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు మొత్తం 1,075 మంది గాను 1,048 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు సిట్టింగ్‌, ఫ్‌లైయింగ్‌ స్క్వాడ్‌లతో నిరంతర పర్యవేక్షణ కొనసాగిందని, పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

వైద్యకళాశాల రీసెర్చ్‌

యూనిట్‌కు జాతీయ అవార్డు

తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాలలో వైద్య పరిశోధనా విభాగం సౌజన్యంతో 2014 ఏర్పా టు చేసిన మల్టీ డిస్‌ప్లెయినరీ రీసెర్చ్‌ యూనిట్‌కు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలోని సుష్మాస్వరాజ్‌ భవనంలో ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ నియంత్రణ శాఖ నిర్వహించిన ‘వైద్య కళాశాల పరిశోధన కనెక్ట్‌ – 2026’ కార్యక్రమంలో ఈ అవార్డును అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వైద్యకళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రవిప్రభు మా ట్లాడుతూ వైద్య పరిశోధనల్లో శ్రీవేంకటేశ్వర వైద్య కళాశాల దేశంలోనే ప్రథమ స్థానంలో ని లవడం గర్వకారణమని కొనియాడారు. ఈ అ వార్డును కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ చేతుల మీదుగా ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రవిప్రభు, నోడల్‌ అధికారి, డాక్టర్‌ కిరీ టి, సెంటిస్ట్‌ మధు అందుకున్నారు.

విభిన్న ప్రతిభావంతులకు ఇంటర్వ్యూలు

తిరుపతి అర్బన్‌: జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రా, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ ద్వారా మూడు చక్రాల వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్న 104 మంది అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి కమిటీ సభ్యులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి కమిటీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పరిశీలించింది. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శోభన్‌ బాబు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు భరత్‌ కుమార్‌, జిల్లా రవాణా శాఖ కమిషనర్‌ మురళీమోహన్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ వసంతబాయి, ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ పవన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ఇంటర్‌ పరీక్షకు  454 మంది గైర్హాజరు 1
1/1

ఇంటర్‌ పరీక్షకు 454 మంది గైర్హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement