తెప్పపై సీతారామలక్ష్మణులు | - | Sakshi
Sakshi News home page

తెప్పపై సీతారామలక్ష్మణులు

Feb 27 2026 4:09 AM | Updated on Feb 27 2026 4:09 AM

తెప్ప

తెప్పపై సీతారామలక్ష్మణులు

● శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం ● తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి తెప్పపై విహారం

తిరుమల: కలియుగవైకుంఠం తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత రామచంద్రుని ఉత్సవమూర్తులు ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. తొలిరోజు స్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు ప్రదక్షిణ చేస్తూ భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈఓ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్‌ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ పాల్గొన్నారు.

తెప్పపై సీతారామలక్ష్మణులు1
1/1

తెప్పపై సీతారామలక్ష్మణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement