బాల్‌ వివాహ్‌ ముక్తి రథ్‌కు మద్దతు ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

బాల్‌ వివాహ్‌ ముక్తి రథ్‌కు మద్దతు ఇవ్వండి

Feb 27 2026 4:09 AM | Updated on Feb 27 2026 4:09 AM

బాల్‌ వివాహ్‌ ముక్తి రథ్‌కు మద్దతు ఇవ్వండి

బాల్‌ వివాహ్‌ ముక్తి రథ్‌కు మద్దతు ఇవ్వండి

తిరుపతి ఎంపీ గురుమూర్తిని కలిసిన ప్రగతి సంస్థ ప్రతినిధులు

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ‘‘బాల్‌ వివాహ్‌ ముక్తి రథ్‌’’ కార్యక్రమానికి మద్దతు కోరుతూ ఆ సంస్థ ప్రతినిధులు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం, జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న 100 రోజుల సుదీర్ఘ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోందని వారు తెలిపారు. జిల్లాలో 30 రోజులపాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అవగాహన రథం ద్వారా బాల్య వివాహాల దుష్పరిణామాలు, చట్టపరమైన చర్యలు, బాలల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నట్లు తెలిపారు. బాల్య వివాహాలు అధికంగా ఉన్న గ్రామాలను గుర్తించి అక్కడ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ఎంపీకి వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ ‘‘బాల్య వివాహం ఒక సామాజిక అనర్థం మాత్రమే కాదు, అది బాలల భవిష్యత్తును దెబ్బతీసే తీవ్రమైన సమస్య.. ప్రతి బాలికకు విద్య, ఆరోగ్యం, భద్రత కల్పించడం మనందరి బాధ్యత అన్నారు. 2030 నాటికి బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అత్యంత అవసరమన్నారు. ఈ కార్యక్రమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement