అభివృద్ధి ఊసేది? | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి ఊసేది?

Jan 15 2026 8:25 AM | Updated on Jan 15 2026 8:25 AM

అభివృ

అభివృద్ధి ఊసేది?

తారల తళుకు బెళుకులే..

ఫ్లెమింగో ఫెస్టివల్‌ అంటే.. తారల తళుకుబెళుకులే తప్ప, మంత్రులు పులికాట్‌ అభిృవృద్ధికి ఇచ్చిన హామీలు నీటి మూటలవుతున్నాయి. ఏటా వస్తున్నారు..వెళుతున్నారు.. విదేశీ వలస విహంగాల ఆవాసానికి వసతులు కల్పించిన దాఖలాలు శూన్యం. హామీలు అమలుకు నోచుకోక పులికాట్‌ జీవవైవిధ్యం కోల్పోతోంది.

సూళ్లూరుపేట: ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న పులికాట్‌ సరస్సుకు ఏటా శీతాకాలంలో విచ్చేసే విదేశీ వలస విహంగాలను ఆధారంగా చేసుకుని ఫ్లెమింగో ఫెస్టివల్‌ 2001 నుంచి నిర్వహిస్తున్నా సరస్సు అభివృద్ధికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గత 25 ఏళ్లల్లో 21 సార్లు పండుగను టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు నిర్వహించాయి. ఈ కాలంలో పులికాట్‌ సరస్సు, నేలపట్టు పక్షులు రక్షితకేంద్రం, భీములవారిపాళెం పడవల రేవు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఏటా పక్షులు పండుగ ప్రారంభోత్సవానికి, ముగింపు ఉత్సవానికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల వచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి, అనేక రకాల హామీలు ఇచ్చేసి వెళుతున్నారు. 2001 నుంచి 2004 దాకా, 2014 నుంచి 2019 దాకా, అలాగే 2025 నుంచి ఇప్పటివరకు అఽధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పండుగను తామే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడం తప్ప పులికాట్‌ సరస్సు అభివృద్ధికి చేసేదిదేమీ లేదు. ప్రస్తుత పర్యాటక శాఖామంత్రి 2025లో పండుగ ప్రారంభోత్సవానికి విచ్చేసి సూళ్లూరుపేట ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా చేస్తానని హామీ ఇచ్చా రు. గత ఏడాది ముగింపు ఉత్సవానికి విచ్చేసిన ఆ యన అప్పుడూ ఇదే వ్యాఖ్యలు చేశారు. అదే వ్యాఖ్య లు ఈ ఏడాది కూడా చేశారు. పులికాట్‌ ముఖద్వారాల పూడికతీతకు రూ.142 కోట్లు సీఎం చంద్రబా బు మంజూరు చేశారని 2025లో చెప్పారు. ఈ ఏడా దీ అదే విషయం చెప్పారు.

జీవ వైవిధ్య సరస్సుగా పులికాట్‌

ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల్లోని తిరుపతి జిల్లా, తిరువళ్లూరు జిల్లాల పరిధిలో సుమారు 620 చదరపు కిలోమీటర్లు పరిధిలో పులికాట్‌ సరస్సు విస్తరించి ఉంది. ఇందులో 500 చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని తిరుపతి జిల్లా తడ, సూళ్లూరుపేట, దొర వారిసత్రం, వాకాడు, చిట్టమూరు మండలాల్లో విస్త రించి ఉంది. మిగిలిన 120 చదరపు కిలో మీటర్లు త మిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి, పొన్నేరి తాలుకా పరిధిలో విస్తరించి ఉంది. బంగాళా ఖాతం నుంచి తమిళనాడు పరిధిలోని పలవేరికాడ్‌ వ ద్ద ఒక ముఖద్వారం, వాకాడు మండలం కొండూరుపాళెం, రాయదొరువు వద్ద రెండు ముఖద్వారాలు ఉ న్నాయి. వర్షాకాలంలో వరదలు వచ్చినా, చిన్నపాటి వర్షాలు వచ్చినా స్వర్ణముఖి, కాళంగినది, తమిళనాడులో ఆరణియార్‌ నదులతో పాటు చిన్నా చితకా కా లువల నుంచి మంచినీరు సరస్సుకు చేరుతుంది. స ముద్రంలో ఆటుపోట్లు వచ్చి అలల ఉఽధృతి పెరిగినపు డు కడలి నుంచి ఉప్పునీరు పులికాట్‌లోకి ప్రవేశిస్తుంది. మంచినీరు, ఉప్పునీరు కలగలసిన సంగమం కావడంతో మత్స్య సంపద అభివృద్ధి చెందుతుంది. సుమా రు 20 వేలమంది మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడమే కాకుండా 204 రకాల 1.20 లక్షల విదేశీ వలసపక్షులకు ఆహారాన్ని అందిస్తూ జీవవైవిధ్యాన్ని సంతరించుకున్న రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా గుర్తింపు ఉంది. తమిళనాడులోని పల్‌వేరికాడ్‌ ముఖ ద్వారాన్ని ఏటా సుమారు రూ.30 లక్షల వ్యయంతో ఇసుకమేటలు తొలగించే ప్రక్రియను చేపడుతున్నారు. అందుకే దక్షిణవైపు సరస్సు ఎప్పుడూ జలకళతో కళకళలాడుతోంది. వాకాడుమండలం రాయదొరువు, కొండూరుపాళెం ముఖద్వారాలు మూసుకు పోవడంతో వేసవిలో ఉత్తరవైపు సరస్సు ఎడారిని తలపిస్తోంది. తమిళనాడు తరహాలో రాయదొరువు, కొండూరుపా ళెం ముఖద్వారాలను పూడిక తీయిస్తే ఈ ప్రాంతంలో కూడా సరస్సు ఎప్పుడు జలకళతో కళకళలాడే ఆవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని అటు మత్స్యకారులు, ఇటు పర్యావరణ ప్రేమకులు శ్రీసిటీలో ఏర్పాటు చేసిన సింపోజియంలో కోరారు.

వర్షాకాలంలో నిండుకుండలా పులికాట్‌ సరస్సు (పాతచిత్రం)

కాంగ్రెస్‌ హయాంలోనే రాష్ట్ర ఉత్సవం

ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నపుడు కూడా ఎన్నో హామీలిచ్చారు. ఇలా ఎంతో మంది మంత్రులు వస్తున్నారు.. వెళుతున్నా రు. సరస్సు అభివృద్ధికి మాత్రం ఎవరూ కృషి చేయలేదు. అయితే పక్షులు పండుగను మాత్రం 2013లో టూరిజం క్యాలండర్‌లో చేర్చారు. ఆ తరువాత 2014లో స్టేట్‌ మెగా ఫెస్టివల్‌గా మార్చారు. పక్షుల పండుగ అంటే మూడు రోజులు పాటు సినీ తారల తళుకు బెళుకులు, సినీ యాంకర్లు, పాట కచ్చేరిలు, రక రకాల అర్ధనగ్నం డాన్స్‌లు, కామెడీ షోలు మిమిక్రీలు లాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో సరిపెట్టేసి మమ అనిపించేస్తున్నారు.

పక్షులు నివాసానికి వసతులేవీ?

నేలపట్టులో పక్షులు నివాసానికి చెట్లు పెంచడం, పులికాట్‌ సరస్సులో నీళ్లు ఎప్పుడూ ఉండేలా ముఖద్వారాలు పూడిక తీయించడం, భీములవారి పాళెం పడవల రేవు వద్ద రిస్టార్ట్స్‌ ఏర్పాటు, నిరంతర బోట్‌ షికారు తదితర పనులు చేయాల్సి ఉన్నా ఆ దిశగా ఎవరూ ప్రయత్నం చేయలేదు. పండుగ మూడు రోజులు రాజకీయ నాయకులు ఉత్తుత్తి హామీలు, అధికారులు హడావుడి తప్ప ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదు. ఆనం రామనారాయణరెడ్డి పర్యాటకశాఖామంత్రిగా ఉన్న సమ యంలో భీములవారిపాళెం పడవల రేవు వద్ద రిసార్ట్స్‌ నిర్మాణానికి వేసిన శిలా ఫలకాలు ఇప్పటికీ వెక్కిరిస్తూనే ఉన్నాయి.

అభివృద్ధి ఊసేది? 1
1/2

అభివృద్ధి ఊసేది?

అభివృద్ధి ఊసేది? 2
2/2

అభివృద్ధి ఊసేది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement