రేణిగుంటలో కొండచిలువ ప్రత్యక్షం
● భయాందోళనలో స్థానికులు
రేణిగుంట: పట్టణంలోని పాంచాలినగర్ నాలుగో వీధిలో కాపురమున్న కళ్యాణి ఇంట్లో మంగళవారం కొండచిలువ ఉండడంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు సర్పంచ్ నగేషం దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లారు. ఆయన పంచాయతీ కార్మికులతో కలసి సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులకు ధైర్యంగా ఉండాలని సూచించారు. వెంటనే పూడి గ్రామంలోని స్నేక్ క్యాచర్ కుప్పస్వామికి సమాచారం అందించారు. ఆయన వెంటనే రేణిగుంటకు చేరుకుని కొండచిలువను చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. పట్టణంలో కాపురాలు ఉండే ప్రాంతంలోకి కొండచిలువ రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.


