శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: శ్రీవారిని మంగళవారం సినీ డైరెక్టర్ తిరుమల కిషోర్, హీరోయిన్ ఆషికా రంగనాథ్, సినీ నటుడు విజయ్‌కుమార్, నటి ప్రీతి దర్శించుకున్నారు. వీరికి ఆలయాధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా, టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో ఘనంగా సత్కరించారు.
ఎస్వీయూలో
నూతన భవనాలు ప్రారంభం
తిరుపతి సిటీ: ఎస్వీయూలో పలు నూతన భవనాలను, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. బుధవారం నారావారిపల్లెలో ఏర్పాటు చేసిన వర్సిటీ అభివృద్ధి కార్యక్రమాలకు చెందిన శిలాఫలకాలను ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎస్వీయూలో రూ.7.5 కోట్లతో నిర్మించిన బాయ్స్ హాస్టల్, రూ. 5 కోట్లతో నిర్మించిన గర్‌ల్స్ హాస్టల్‌ను ప్రారంభించారు. అలాగే వర్సిటీ పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ.6 కోట్లతో సెంట్రల్ అడ్వాన్డ్ పరిశోధన ల్యాబ్‌కు, విద్యా మౌళిక వసతులల్లో భాగంగా రూ.5.03 కోట్లతో అకడమిక్ బిల్డింగ్ రెండో అంతస్తుకు, రూ.2.91 కోట్లతో చేపట్టే ప్రహరీగోడ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
16న విశ్వంలో సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ మోడల్ టెస్ట్
తిరుపతి సిటీ: స్థానిక వరదరాజనగర్‌లోని విశ్వం సైనిక్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆల్ ఇండియా సైనిక్ స్కూ ల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ – 2026కు సంబంధించి ఈనెల 16న ఉచిత మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్ విశ్వనాథ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయి లో సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఈనెల 18వ తేదీన జరగనున్న నేపథ్యంలో, సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షకు ముందస్తు సాధన కల్పించేందుకు మోడల్ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ నమూనా పరీక్ష ద్వారా విద్యార్థులు ప్రధాన పరీక్షకు సన్నద్ధం కావడంతో పాటు, సబ్జెక్టుల వారీగా తమ లోపాలను గుర్తించి, సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంద న్నా రు. మోడల్ పరీక్షకు ఎటువంటి ప్రవేశ రుసుము అవసరం లేదని స్పష్టం చేస్తూ, పరీక్షకు హాజర య్యే విద్యార్థులు తమ సైనిక్ స్కూల్ అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) జిరాక్స్ కాపీని తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 86888 88802/93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
రూ,30 లక్షలు విలువ చేసే బంగారం చోరీ
రైల్వేకోడూరు అర్బన్: రైల్వే కో డూరులోని నగర్ లో తాళ్లపాక సురే ష్‌రెడ్డి, పూజితల ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లో బీరువాలోని రూ.30 లక్షలు వి లువ చేసే 21 తు లాల బంగారం గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం చోరీ చేశారు. వివరాల్లోకి వెళితే.. భార్యాభర్తలు తమ కుమార్తె మొక్కుబడి తీర్చుకోవడానికి శుక్రవారం శ్రీశైలం దేవస్థానానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి మంగళవారం ఇంటికి వచ్చి చూడగా గ్రిల్, తలుపుల తాళాలు పగులగొట్టి ఉండడం గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ లక్ష్మీప్రసాద్‌రెడ్డి విచారణ జరిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు
శ్రీవారి సేవలో ప్రముఖులు
శ్రీవారి సేవలో ప్రముఖులు


