ఎర్రచందనం దుంగలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Jan 14 2026 7:15 AM | Updated on Jan 14 2026 7:15 AM

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

రేణిగుంట:శేషాచలం నుంచి అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారని సమాచారంతో మంగళవారం తెల్లవారుజామున మామండూరు సమీపంలో రేణిగుంట–కడప రహదారిలో అటవీశాఖ అధికారు లు తనిఖీలు చేశారు. ముందుగా ద్విచక్ర వాహనం వేగంగా రావడానికి గమనించిన అధికారులు ఆపడానికి ప్రయత్నించగా వాహనాన్ని వదిలి ఓ వ్యక్తి అడవిలోకి పరారయ్యాడు. వెనుక వస్తున్న వారు ఈ విషయం గుర్తించి, కారుని ఆపి అడవిలోకి పారిపోయారు. కారుని పరిశీలించగా అందులో 249 కిలోల బరువున్న 15 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. అటవీ క్షేత్రాధికారి సుదర్శన్‌ రెడ్డి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడుల్లో డీఆర్‌ఓ గౌస్‌కరీం, ఎఫ్‌బీఓ శరవణ కుమార్‌, బేస్‌ క్యాంప్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement