భోగి మంటల్లో 590, 847జీఓ ప్రతులు
పెళ్లకూరు: చంద్రబాబు సర్కారు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తూ విడుదల చేసిన 590, 847 జీఓ నకలు పత్రాలతో భోగి మంటలు వేశామని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆయన నాయకులు కలిసి బుధవారం పుల్లూరులో సంబంధిత జీఓ నకలు పత్రాలను భోగిమంటల్లో వేసి కాల్చివేశారు.
ఈ సందర్భంగా చిందేపల్లి మాట్లాడుతూ వైద్యం, వైద్యవిద్య పేద కుటుంబాల విద్యార్థులకు అందుబాటులో ఉండాలనే ఆకాంక్షతో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉండాలనే లక్ష్యంతో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేయించారన్నారు. వీటిలో ఐదు మెడికల్ కళాశాలలు పూర్తి కాగా మరికొన్ని వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేయడంతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టి గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్‌రెడ్డి, గురవయ్య, చెంగయ్య, రామయ్య, సునీల్, నరసింహులు, మురళి, గోపి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


