రెండేళ్లవుతున్నా సూపర్ సిక్స్ హామీలెక్కడ?
తిరుపతి మంగళం : ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలన్న దురాలోచనతో నోటికి వచ్చినట్లు చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి రెండేళ్లవుతున్నా అమలు ఎక్కడ అని వైఎస్సార్‌సీపీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి ప్రశ్నించారు. తిరుపతి లక్ష్మీపురం వద్ద ఆయన ఆధ్వర్యంలో బుధవారం భోగి పండుగ సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీల ప్రతులను పార్టీ నాయకులు భోగి మంటల్లో వేసి తగులపెట్టారు. ఈ సందర్భంగా మల్లం రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు అధికార దాహమే తప్ప, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న కనీస ఆలోచన లేదని మండిపడ్డారు. ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో దేశ రాజకీయాలకే ఆదర్శంగా చరిత్రలో నిలిచిపోయేలా సంక్షేమ పథకాలు అందించిన ఏకై క నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. కూటమి నాయకులకు ఎందుకురా గెలింపించామని ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. కూటమి నేతల మనసుల్లోని మోసం, వంచన భోగిమంటల్లో కాలిపోవాలని, ఇక నుంచైనా ప్రజలకు మేలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు నల్లాని బాబు, వాసుయాదవ్, మల్లం రవికుమార్, గీతాయాదవ్, కార్పొరేటర్ కోటూరు ఆంజినేయులు, పార్టీ నాయకులు వెంకటేష్‌రాయల్, మునిరెడ్డి, కడపగుంట అమరనాధ్‌రెడ్డి, పసుపులేటి సురేష్, దినేష్‌రాయల్, అనీల్‌రెడ్డి, అంజూర్‌బాషా, పద్మజ, విజయలక్ష్మి, బాలాజీ, కోటి, స్వరూప్, రమణారెడ్డి, మురళీయాదవ్, లక్ష్మణ్‌రాయల్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


