పక్కా ప్రణాళికతో విజయం సాధ్యం | - | Sakshi
Sakshi News home page

పక్కా ప్రణాళికతో విజయం సాధ్యం

Jan 14 2026 7:10 AM | Updated on Jan 14 2026 7:10 AM

పక్కా

పక్కా ప్రణాళికతో విజయం సాధ్యం

● పరీక్షల సమయంలో ఏకాగ్రతను దెబ్బతీసే టీవీ, సెల్‌ఫోన్లు, సాంకేతిక ఆట పరికరాలకు దూరంగా ఉండాలి. ● సినిమాలు, ఫంక్షన్లు, విందు వినోదాలకు హాజరుకాకపోవడం ఉత్తమం. ● చెడు వ్యసనాలకు లోనుకాకుండా జాగ్రత్త పడాలి. చెడు స్నేహాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ● పరీక్షలకు సమయం ఉందిగా, రేపు చదువుదామని వాయిదా వేస్తూ నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ● మంచి మెరిట్‌ విద్యార్థులతో స్నేహం ఏర్పరచుని తెలియని విషయాలను చర్చించాలే తప్ప, అనవసరమైన చర్చలు జరిపి సమయాన్ని వృథా చేసుకోవద్దు. ● సిలబస్‌ పూర్తి అయ్యిందని ఇంటి వద్ద ఉండకుండా తరగతులకు హాజరుకావాలి. సందేహాల నివృత్తి చేసుకోవాలి. ● పరీక్షలంటే భయం వీడాలంటే పాఠశాలు, కళాశాలల్లో అధ్యాపకులు నిర్వహించే స్లిప్‌ టెస్ట్‌లు, వారంతపు పరీక్షలు, ఫ్రీఫైనల్‌ పరీక్షలకు తప్పక హాజరు కావాలి. ● పాత ప్రశ్నపత్రాలు, మోడల్‌ పేపర్లను క్రమం తప్పకుండా ప్రాక్టీస్‌ చేయాలి. ● సబ్జెక్టుల వారీగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకుని సన్నద్ధం కావాలి. ● కొన్ని సబ్జెక్టుల్లో వెనుకబడిన పిల్లలను టీచర్లతోపాటు తల్లిదండ్రులు ప్రత్యేకంగా పరిశీలించి శ్రద్ధ తీసుకోవాలి. ● పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో తల్లిదండ్రులు విద్యార్థులల్లో ఆత్మస్థైర్యం నింపి, ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయాలి. ● కఠిన పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సంక్రాంతి సెలవులు విద్యార్థులకు సువర్ణావకాశం. సెలవుల్లో రోజుకు కనీసం 5 గంటల పాటు క్లిష్టమైన సబ్జెక్టులపై దృష్టి సారిస్తే పరీక్షలను సులువుగా ఎదుర్కొనవచ్చు. ● ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బోటనీ వంటి ప్రధాన సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలను కేవలం చదివి వదిలేయకుండా, చదివిన ప్రతి అంశాన్ని రాయడం ప్రాక్టీసు చేస్తే చిన్న తప్పులు దొర్లడానికి వీలులేకుండా పూర్తి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. ● ఏకదాటిగా గంటల కొద్ది కూర్చొని పుస్తకానికి అతుక్కుపోకుండా మధ్య మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవాలి. ● పాఠ్యాంశాలను బట్టీ పట్టకుండా అర్థం చేసుకుని చదివితే క్లిష్టమైన ప్రశ్నలకు సైతం సులువుగా సమాధాలు రాయవచ్చు. ● సమస్యాత్మక పాఠ్యాంశాలను టీచర్ల దృష్టికి తీసుకువెళ్లి అర్థమయ్యే వరకు చెప్పించుకోవాలి. ● నీట్‌, జేఈఈ మెయిన్స్‌ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు గతంలో జరిగిన 10 ఏళ్ల పేపర్లను క్షుణంగా పరిశీలించాలి. ఎన్‌సీఆర్‌టీ పాఠ్యాంశాలతోపాటు నిపుణులు రచించి ప్రత్యేక పుస్తకాలను చదవాలి.

ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు కఠిన పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి అవసరం

పరీక్ష రాసే సమయంలో విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా సమయపాలన పాటించాలి.

ప్రశ్నపత్రాన్ని 2 నిమిషాలపాటు చివరి వరకు చదవాలి.

బాగా తెలిసిన ప్రశ్నలను ఎంచుకుని జవాబు పత్రంలో తొలిత సమాధానాలు రాయాలి.

ప్రశ్నల ప్రాధాన్యతను గుర్తించి సమయాన్ని కేటాయించాలి

ప్రశ్నను పూర్తిగా అర్థం చేసుకుని, ఆ తర్వాత సమాధానం రాయాలి. అర్థం చేసుకోకుండా సమాధానాలు రాస్తే మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది.

సమాధానాలను పేజీలు నింపడం కాకుండా క్లుప్తంగా కచ్చితమైన సమాధాన్ని రాయాలి.

సాధ్యమైనంతవరకు కొట్టివేతలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రశ్నలకు సమాధానం రాయాలి. చేతిరాత విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

చివరి 10 నిమిషాలు తాను రాసిన సమాధానాలను ఒక సారి పరిశీలించుకుంటే తప్పులను సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

జేఈఈ, నీట్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఆబ్జెక్టీవ్‌ ప్రశ్నల విషయంలో సమాధానాలు అన్ని సరైనవిగా కన్పించవచ్చు. సమాధానం తెలిస్తేనే మార్కు చేయాలి. లేనిపక్షంలో వదిలి వేయాలి. లేదంటే మైనస్‌ మార్కుల ప్రమాదం ఉంటుందని గ్రహించాలి.

పరీక్ష సమయంలో ఆసన్నమవుతున్న సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. తల్లిదండ్రులు ప్రధానంగా విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి.

కనీసం రోజుకు 6 నుంచి 7గంటల పాటు సంపూర్ణ నిద్ర అవసరం.

యోగా, ధ్యానం నిత్యం 30 నిమిషాల పాటు చేస్తే మెదడు చురుకుగా పనిచేస్తుంది.

సమయం ఉంటే 30 నిమిషాల పాటు ఉదయం లేదా సాయంత్రం ఏకాంతంగా వాకింగ్‌ చేస్తే మంచిది.

బిర్యానీలు, జంక్‌ ఫుడ్‌లు, బేకరీ ఐటమ్స్‌, చైనీస్‌ ఫుడ్స్‌, మసాలా అధికంగా ఉండే ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.

ఆకుకూరలు, విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్‌ అధికంగా ఉండే ఆహారాలను తల్లిదండ్రులు విద్యార్థులకు అందించాలి.

పరీక్షలు ముగిసే వరకు మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది.

పది పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివితే టాపర్లుగా నిలిచే అవకాశ ఉంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సిలబస్‌ పూర్తి చేసి రివిజన్‌ చేస్తున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించి సామర్థ్యపు పరీక్షలతో విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు.

– జి సురేష్‌, సీఎంఓ, సమగ్ర శిక్ష, తిరుపతి జిల్లా

పోటీ పరీక్షలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం

నీట్‌,జేఈఈ మెయిన్స్‌ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతు న్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్‌లో దొరికే బిట్‌ బ్యాంక్‌లు చది వితే ఉపయోగం ఉండదు. పది,ఇంటర్‌ సిలబస్‌ను లోతుగా అధ్యయనం చేయాలి. ప్రతి పాఠ్యాంశాన్ని క్షుణంగా చదివి ప్రాక్టీస్‌ చేయాలి.

– రవిశంకర్‌, రిటైర్డ్‌, అధ్యాపకులు, తిరుపతి

కొత్త సిలబస్‌తో పరీక్షలు..జాగ్రత్త సుమా

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులు కొత్త సిలబస్‌తో నూ తన పరీక్షా విధానాన్ని ఎ దుర్కొబోతున్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ప్రీఫైనల్‌ పరీక్షలతో పేపర్‌ నమూనా తెలిసి ఉంటుంది. క్లిష్టమైన మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, బోటనీపై ప్రత్యేక శ్రద్ధవహించాలి. –సరస్వతి, లెక్చరర్‌ తిరుపతి

వీటికి దూరంగా ఉండాల్సిందే!

తిరుపతి సిటీ: పరీక్షల కాలం సమీపిస్తోంది. టెన్త్‌, ఇంటర్‌తోపాటు జేఈఈ మెయిన్స్‌, నీట్‌ పరీక్షలు దగ్గర పడ్డాయి. విద్యార్థులు పుస్తకాలకు పరిమితం కావాల్సి సమయం ఆసన్నమైంది. పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విద్యార్థులను ఇటు టీచర్లు అటు తల్లిదండ్రులు సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో విద్యాసంస్థల యాజమాన్యా లు, ప్రభుత్వాధికారులు, ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. ఈ నేప థ్యంలో విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్త మ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని మేధావులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

విజయానికి సూచనలివే...

సమీపిస్తున్న టెన్త్‌, ఇంటర్‌, జేఈఈ, నీట్‌ పరీక్షలు

ఇవి పాటించాలి

ఆరోగ్యం ప్రధానమే

పక్కా ప్రణాళికతో విజయం సాధ్యం 
1
1/2

పక్కా ప్రణాళికతో విజయం సాధ్యం

పక్కా ప్రణాళికతో విజయం సాధ్యం 
2
2/2

పక్కా ప్రణాళికతో విజయం సాధ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement