23న చర్లపల్లి నుంచి తిరుచానూరుకు ప్రత్యేక రైలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 23వ తేదీన తెలంగాణాలోని చర్లపల్లి నుంచి తిరుచానూరుకు ప్రత్యేక రైలును నడపనున్నట్లు ప్రకటించింది. కాగా అదే రోజు కడప జిల్లాలోని కొప్పర్తిలో దీని ఇజ్తిమా(ముస్లింల మతపరమైన సమావేశం) జరగనుంది. ఈ కార్యక్రమం కోసం హాజరయ్యే వారి సౌక ర్యార్థం ప్రత్యేక రైలును నడపనున్నారు. అయి తే రైలు నంబరు (07140) చర్లపల్లి–తిరుచానూరు రైలు జనవరి 22న చర్లపల్లిలో బయలుదేరుతుంది. నిజామాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు మీదుగా ప్రయాణించి ఉదయం 5.30 గంటలకు నంద్యాలకు చేరుకుంటుంది. నంద్యాల నుంచి ఈ రైలు కడప మీదుగా తిరుచానూరుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబరు (07141) జనవరి 25న రాత్రి 11.30 గంటలకు తిరుచానూరులో బయలుదేరుతుంది. తెల్లవారుజామున 3 గంటలకు కడపకు, ఉదయం 6.50 గంటలకు నంద్యాలకు చేరుకుని, అక్కడి నుంచి గుంటూరు, విజయవాడ, వరంగల్, నిజామాబాద్ మీదుగా చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు కడపలో జరిగే ఇజ్తిమాకు వెళ్లే నంద్యాల వాసులకు ప్రయోజనకరంగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.
టీటీడీకి
రూ.20 లక్షలు విరాళం
తిరుమల: టీటీడీ మాజీ సీవీఎస్వో దామోదర్ టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.20 లక్షలు విరాళం ఇచ్చా రు. ఈ మేరకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
స్విమ్స్ ఓపీ, ఓటీలకు
రేపు సెలవు
తిరుపతి తుడా: మకర సంక్రాంతి సందర్భంగా గురువారం స్విమ్స్ ఆస్పత్రిలో ఓపీ, ఓటీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని, ఈ విషయాన్ని రోగులు గుర్తించి సహకరించాలని సూచించారు.
కలెక్టరేట్‌లో
కొత్త జిల్లా మ్యాప్
తిరుపతి అర్బన్: జిల్లాలో రాజకీయ కోణంలో చంద్రబాబు సర్కార్ ఇటీవల చేపట్టిన పునర్విభజనతో 34 మండలాలున్న జిల్లా 36 మండలాలుగా మారింది. అయితే 4 రెవెన్యూ డివిజన్లు ఉన్న జిల్లా ప్రస్తుతం 3 రెవెన్యూ డివిజన్లగా మార్పు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కలెక్టరేట్‌లో కొత్త మండలాలతో(36తో) కూడిన మ్యాప్‌ను గోడకు ఏర్పాటు చేశారు. తిరుపతి రెవెన్యూ డివిజన్‌లో 14 మండలాలు, శ్రీకాళహస్తి డివిజన్‌లో 11, సూళ్లూరుపేట డివిజన్‌లో 11 మండలాలతో కూడిన మ్యాప్‌ను ఉంచారు.
తిరుమలకు
తగ్గిన ప్రయాణికులు
తిరుపతి అర్బన్ : తిరుమలకు ప్రయాణికుల రద్దీ తెలిసిందే. నిత్యం తిరుపతిలోని ఏడుకొండల బస్టాండ్‌లో ప్రయాణికులు కిటకిటలాడుతుంటారు. అయితే సంక్రాంతి నేపథ్యంలో నాలుగు రోజులుగా బస్టాండ్ బోసిపోతోంది. సాధారణంగా రోజూ తిరుపతి నుంచి తిరుమలకు 80వేల రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 50వేల మందికి పడిపోయింది. దీంతో చాలా బస్సులు ఖాళీగా డిపోలోనే ఉండిపోవడం గమనార్హం.
23న చర్లపల్లి నుంచి తిరుచానూరుకు ప్రత్యేక రైలు
23న చర్లపల్లి నుంచి తిరుచానూరుకు ప్రత్యేక రైలు


