సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
చంద్రగిరి: సీఎం చంద్రబాబు సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామం నారావారిపల్లెకు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ సుబ్బరాయుడు సోమవారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలు, యాక్సెస్ కంట్రోల్, నిషేధిత ప్రాంతాల అమలు, వాహనాలపై గట్టి నిఘా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే హెలిప్యాడ్ నుంచి వీఐపీ రూట్ భద్రతను పటిష్టంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. వీఐపీ రూట్ భద్రత, సభా ప్రాంగణం చుట్టుపక్కల ప్రాంతాల్లో గట్టి నిఘా, నిరంతర పరిశీలన, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా కంట్రోల్ రూమ్, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు, ఫైర్, అంబులెన్స్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా చర్యలను సమన్వయంతో అమలు చేయాలని తెలిపారు.


