వచ్చారు..అర్జీలు ఇచ్చి వెళ్లారు!
తిరుపతి అర్బన్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు అర్జీదారులు సంఖ్య బాగా తగ్గింది. దీంతో అధికారులను కలవడానికి అర్జీదారుల తోపులాటలు, సిపార్స్‌తో అడ్డదారిలో వెళ్లడం తదితర కార్యక్రమాలకు చోటులేకుండా పోయింది. అర్జీదారులు నేరుగా వచ్చారు..తమ అర్జీని అధికారులకు ఇచ్చి, ఇంటికి వెళ్లిపోయారు.. అన్న చందంగా సాగింది. డీఆర్వో నరసింహులు ఆధ్వర్యంలో పీజీఆర్‌ఎస్‌ను సోమవారం చేపట్టారు. ఈ సోమవారం కేవలం 241 అర్జీలు వచ్చాయి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్‌మాండ్, శివశంకర్‌నాయక్ అర్జీలను అందుకున్నారు. అందులో 146 అర్జీలు రెవెన్యూ సమస్యలు, 25 అర్జీలు పింఛన్లపై ప్రధానంగా అందజేశారు.


