కోడి పందేలు చట్టవిరుద్ధం | - | Sakshi
Sakshi News home page

కోడి పందేలు చట్టవిరుద్ధం

Jan 13 2026 5:40 AM | Updated on Jan 13 2026 5:40 AM

కోడి

కోడి పందేలు చట్టవిరుద్ధం

తిరుపతి అర్బన్‌: సంక్రాంతి నేపథ్యంలో సంప్రదాయ పద్ధతులంటూ కోడి పంందాలు నిర్వహిస్తే, అది చట్టవిరుద్ధమని పశుసంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు డి.ఉమామహేశ్వరి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పసు సంవర్థకశాఖతోపాటు పోలీస్‌, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా కోడి పందేలపై ప్రేత్యక దృష్టి సారిస్తారని స్పష్టం చేశారు. జంతు సంక్షేమ చట్టం 1960 ప్రకారం, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కోడి పందేలు ఆడడం జంతువులపై అమానుషత్వం, హింసకు దారితీసి అక్రమ చర్యలుగా గుర్తించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో కోడి పందేలకు అంతా దూరంగా ఉండాలని సూచించారు.

సీఆర్‌ఎస్‌కు జాతీయ అవార్డు

రేణిగుంట: తిరుపతి క్యారేజ్‌ రిపేర్‌ షాప్‌నకు జాతీయ ఉత్తమ రైల్వే వర్క్‌షాప్‌ పురస్కారం రావడం గర్వకారణమని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు అన్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ చేతుల మీదుగా తిరుపతి క్యారేజ్‌ రిపేర్‌ షాప్‌ చీఫ్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ జాతీయ ఉత్తమ రైల్వే వర్క్‌షాప్‌ పురస్కారం అందుకుని సోమవారం సీఆర్‌ఎస్‌కు చేరుకున్నారు. మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు, ఆఫీస్‌ బేరర్లు, కార్యకర్తలు కలిసి శ్రీనివాస్‌ని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ అవార్డు సాధన వెనుక వర్క్‌షాప్‌ పూర్వపు చీఫ్‌మేనేజర్‌ దేవసహాయం దూరదృష్టి, అమోఘమైన కృషి, అలాగే కార్మికులు, సూపర్‌వైజర్లు, సిబ్బంది అందరి శ్రమ ఉందని శ్రీనివాస్‌ తెలిపారు. కార్మికుల సంక్షేమం, పచ్చదనం, పరిశుభ్రత, ఉత్పాదకత పెంపు వంటి రంగాల్లో తిరుపతి క్యారేజ్‌ రిపేర్‌ షాప్‌ సాధించిన ప్రగతి ఈ అవార్డుకు నిదర్శనమన్నారు. వర్క్‌షాప్‌ను జాతీయ స్థాయిలో నిలిపిన ప్రతి కార్మికుడికి, సూపర్‌వైజర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం యూనియన్‌ కార్యదర్శి బాబు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కేక్‌ కట్‌ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో యూనియన్‌ చైర్మన్‌ సదాశివరెడ్డి, కోశాధికారి ముని కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

తిరుపతి రూరల్‌: స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తనపల్లి క్రాస్‌ జంక్షన్‌ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని స్కూటరిస్టు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి రూరల్‌ మండలం, రఘునాథ రిసార్ట్‌, ప్లాట్‌ నంబర్‌ 202, సి బ్లాక్‌ లో నివాసముంటున్న దేశినేని విఠల్‌ బాబు(70) సోమవారం ఉదయం 7 గంటలకు వాకింగ్‌ కోసం బైరాగిపట్టెడ పార్క్‌ వద్దకు తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా జాతీయ రహదారి దాటే క్రమంలో ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లింది. ఈ ప్రమాదంలో దేశినేని విఠల్‌ బాబు రోడ్డుపై పడి గాయపడ్డాడు. చుట్టుపక్కల వారు వెంటనే 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని తిరుపతి రుయా హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఆయన కుమారులు అతనిని కరకంబాడి రోడ్డులోని హీలియోస్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిరుపతి రూరల్‌ ఎస్‌ఐ రామకృష్ణ పేర్కొన్నారు.

కోడి పందేల స్థావరాలపై దాడులు

దొరవారిసత్రం: కొత్తపల్లి, నెల్లూరుపల్లి సమీపంలోని కోడి పందేల స్థావరాలపై స్థానిక ఎస్‌ఐ అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం సాయంత్రం దాడులు చేశారు. ఈ దాడుల్లో నలుగురు పందెం రాయుళ్లను అరెస్టు చేసి, ఐదు బైక్‌లు, నాలుగు కోళ్లు, రూ.3100 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

గుర్తు తెలియని మృతదేహం

రాపూరు: మండలంలోని సైదాదుపల్లి ఎస్టీకాలనీ సమీపంలో సోమవారం ఉదయం గుర్తు తెలియని పురుషుని ఉండడాన్ని మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి, పోలీసులు సమాచారం అందజేశారు. మృతుడి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని, ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ వెంకటరాజేష్‌ తెలిపారు.

కోడి పందేలు చట్టవిరుద్ధం 1
1/2

కోడి పందేలు చట్టవిరుద్ధం

కోడి పందేలు చట్టవిరుద్ధం 2
2/2

కోడి పందేలు చట్టవిరుద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement