ఎనిమిదెకరాల్లో బొప్పాయి మొక్కలు ధ్వంసం
– అడవి పందులు విధ్వంసం
చిట్వేలి:మండలంలోని కంపసముద్రం, కందులవారిపల్లిలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఐదుగురు రైతులకు చెందిన ఎనిమిదెకరాల్లో ఆరు వేల బొప్పాయి మొక్కలు అడవి పందులు ధ్వంసం చేశాయి. గ్రామానికి చెందిన కందుల శంకరయ్య, కె.లక్ష్మమ్మ, కె.మురళి, కె.ఈశ్వరయ్య, కె.రెడ్డెమ్మ సోమవారం ఉదయం పొలానికి వెళ్లి పంట ధ్వంసమై ఉండడాన్ని చూసి లబోదిబోమంటూ గ్రామానికి వచ్చి జరిగిన నష్టాన్ని గ్రామస్తులకు, సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఎనిమిది ఎకరాల్లో ఆరు వేల మొక్కలను పందులు ధ్వంసం చేశాయి. ఒక్కో మొక్క రూ.30 చొప్పున రూ.3 లక్షల పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు, వీహెచ్‌ఏ శివంతిక, వీఆర్‌ఓ బాలసుబ్రమణ్యం సోమవారం ధ్వంసమైన పొలాలను పరిశీలించారు.
తిరుమలలో భారీ నాగుపాము
తిరుమల: తిరుమలలో ఆదివారం భారీ నాగుపాము స్థానికులను భయాందోళనకు గురిచేసింది. స్థానికులు నివాసం ఉండే ఆర్‌బీ సెంటర్ వద్ద భారీ నాగు పాము ఉన్నట్లుగా స్థానికులు గుర్తించారు. వెంటనే విషయాన్ని తిరుమలలోని స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందజేశారు. ఆయన అక్కడకు చేరుకుని ఆరడుగుల నాగుపామును చాకచక్యంగా పట్టుకుని, తిరుమలలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
ఎనిమిదెకరాల్లో బొప్పాయి మొక్కలు ధ్వంసం


