అటకానితిప్పలో పిల్లల సందడి
సూళ్లూరుపేట రూరల్: ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా అటకానితిప్పలోని పక్షుల విజ్ఞాన కేంద్రం చిన్నారులతో కిటకిటలాడింది. పండుగ చివరి రోజు కావడంతో సోమవారం భారీ సంఖ్యలో పిల్లలతోపాటు వారి తల్లిదండ్రులు తరలివచ్చారు. విజ్ఞాన కేంద్రంలో పులికాట్ సరస్సులో లభించే మత్స్యసంపద, పక్షులు రాక, వాటి ఆహారం, నేలపట్టులోని పక్షుల రక్షిత కేంద్రం విశిష్టత, పక్కనే శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగాల గురించి వీడియోల ద్వారా పిల్లలకు అధికారులు అవగాహన కల్పించారు. అక్కడే చిల్ట్రన్స్ పార్కులో పిల్లలు సందడి చేశారు. శ్రీహరికోట వెళ్లే మార్గంలో పులికాట్ సరస్సు ఉండడంతో చిన్నారులు, వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం విద్యార్థులు సరస్సు వద్దకు చేరుకుని పక్షులను తిలకించారు. చిత్తూరు, నెల్లూరు, తిరుపతితో పాటు చైన్నె ప్రాంతాల నుంచి సందర్శకులు విచ్చేసి, విహంగాలను వీక్షించారు. పక్షి ప్రేమికులు ప్రత్యేక కెమెరాలతో విహాంగాల సందడిని చిత్రీకరించారు.
అటకానితిప్పలో పిల్లల సందడి


