పింఛన్ మంజూరు చేయండయ్యా
వెంకటగిరి రూరల్: పింఛన్ మంజూరు చేయండయ్యా అని వెంకటగిరి రూరల్ మండలంలోని అమ్మపాళెం గ్రామానికి చెందిన మోరా రాజమ్మ వేడుకుంటోంది. ఈమెకు పక్షవాతం సోకి అంగవైకల్యం వచ్చింది. కొన్ని సంవత్సరాలుగా మంచంపై జీవనం సాగిస్తోంది. వ్యక్తిగత పనులు సైతం చేసుకోవాలని ఆ మహిళకు ప్రభుత్వం పింఛన్ మంజూరు చేయడంలో నిర్లక్షధోరణితో వ్యవహరిస్తోంది. సదరం శ్లాట్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రాజమ్మకు అంగవైకల్యం ఉందని ధ్రువీకరణ సర్టిఫికెట్ కూడా గతంలో పొంది ఉన్నారు. అర్హత ఉన్న పింఛన్ రాకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.
వేదమే సనాతన ధర్మానికి మూలం
తిరుపతి సిటీ: సంస్కృత భాషకు, భారతీయ సనాతన ధర్మానికి మూలం వేదమేనని జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. సోమవారం కేరళ తిరువనంతపురం వేదికగా అఖిల భారతీయ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన వైదిక సమ్మేళనంలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ వేదాల్లోని జ్ఞానాన్ని భావిభారతానికి అందించడానికి ఇలాంటి వైదిక సమ్మేళనాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
పింఛన్ మంజూరు చేయండయ్యా


