ఘనంగా ముగిసిన పక్షుల పండుగ
సూళ్లూరుపేట రూరల్: సూళ్లూరుపేట వేదికగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ సోమవారం ఘనంగా ముగిసింది. పండుగ ముగింపు సందర్భంగా పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేసి సూళ్లూరుపేట, తడ, దొరవాసత్రం ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. చివరి రోజు కావడంతో సూళ్లూరుపేటలో సంద్శకులతో కిటికిటలాడరు. బాలుర ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ అందరిని అలరించాయి. ఉదయం నుంచి సందర్శకులు భారీగా విచ్చేసి అటకానితప్ప వద్ద ఉన్న పక్షుల విజ్ఞాన కేంద్రాన్ని తిలకించి పులికాట్‌లో పక్షులను వీక్షించారు. మైదానంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకుంది. బాలికలు, చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.


