● బస్సులు.. పడిగాపులు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో తిరుపతి బస్టాండ్ కిక్కిరిసిసోతోది. రెండు రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం సైతం ప్రయాణికులు బస్సుల కోసం నానా అవస్థలు పడ్డారు. గంటల తరబడి పడిగాపులు కాశారు. అవసరాలకు సరిపడా సర్వీసులను అందుబాటులోకి తీసుకురాకపోవడంతో ఆర్టీసీ అధికారులపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన బస్సులో ఎక్కేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సీటు సంగతి దేముడెరుగు.. కాలు మోపే స్థలం దొరికినా చాలు అంటూ ఎగబడిపోతున్నారు. పండుగ వేళ అధికారులు ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. – తిరుపతి అర్బన్
● బస్సులు.. పడిగాపులు
● బస్సులు.. పడిగాపులు


