ఓవరాల్ చాంపియన్‌గా వెటర్నరీ కళాశాల
చంద్రగిరి : విజయనగరం జిల్లా గరివిడిలోని వెటర్నరీ యూనివర్సిటీలో ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన స్పోర్ట్స్, కల్చరల్, లిటరరీ మీట్‌లో తిరుపతి వెటర్నరీ వర్సిటీ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్స్‌గా నిలిచారు. సుమారు 530 మంది పాల్గొన్న ఈ పోటీల్లో తిరుపతి ఎస్వీ వెటర్నరీ విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. అథ్లెటిక్స్ చాంపియన్లుగా విజయ్, అంజలి నిలిచారు. బాలుర బాస్కెట్ బాల్ పోటీల్లో వర్సిటీ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. వీసీ వెంకటరమణ, డైరెక్టర్ వైకుంఠరావు చేతులమీదుగా బహుమతులు అందుకున్నారు. 100, 200, 400 మీటర్ల పరుగు పోటీల్లో వేణుతేజ బంగారు పతకాలను సాధించారు. తమ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్లుగా నిలవడం ఆనందంగా ఉందని అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య తెలిపారు. అనంతరం విద్యార్థులను అభినందించారు. పీడీ జయచంద్ర, ఓఎస్‌ఏ డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ మురళీధర్, డాక్టర్ సుధీర్, డాక్టర్ చైతన్య, డాక్టర్ స్రవంతిని ప్రశంసించారు.
విష్ణు భట్టాచార్యునికి అరుదైన గౌరవం
తిరుపతి సిటీ:జాతీయ సంస్కృత వర్సిటీ ఆగమ విభా గం ఆచార్యులు, దర్శన ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ విష్ణు భట్టాచార్యులకు అరుదైన గౌరవం లభించింది. కర్ణా టక రాష్ట్రం మైసూరు శారదాపీఠం శంకరమఠం వేదికగా ఆదివారం నిర్వహించి న పరిశోధన సంసత్ ప్రథ మ వార్షికోత్సవంలో ఆయనకు నిర్వాహకులు వైఖానస ఆగమ శాస్త్ర రత్నాకర బిరుదుతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంసత్ అధ్యక్షులు డాక్టర్ ఎస్ రాజగోపాల్, పలువురు పండితులు, పాల్గొన్నారు.
ఓవరాల్ చాంపియన్‌గా వెటర్నరీ కళాశాల


