ఈతకు వెళ్లి బాలుడి మృతి
చిట్వేలి : మండలంలోని చిన్నరాచపల్లెలో ఈత కు వెళ్లి రేవంత్ (14) అనే బాలుడు ఆదివారం మృతి చెందాడు. వివరాలు.. రేవంత్ రైల్వేకోడూడులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. తాత పెద్దకర్మ నిమిత్తం తల్లిదండ్రులతో కలిసి గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి గుంజన నదిలో ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. రేవంత్ తల్లిదండ్రులతో కలిసి రైల్వేకోడూరులో నివాసం ఉంటూ నారాయణ హైస్కూల్‌లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. ఇటవల తాత చనిపోవడంతో శనివారం పెద్దకర్మ కావడంతో చిన్నరాచపల్లికి వచ్చాడు. రేవంత్ మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారు.
ఆకట్టుకున్న
ముగ్గుల పోటీలు
చంద్రగిరి: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఆదివారం తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు, సంప్రదాయ వస్త్రధారణ పోటీలకు మహిళలు పోటెత్తారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో విజేతలుగా విద్య, నీరజ నిలిచారు.ఈ రెండు పోటీల్లో విజేతలతోపాటు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారందరికీ విజేతలకు పోడర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ కూర్మారావు, శిల్పారామం నిర్వాహుకులు సుధాకర్, ఖాదర్ వలి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఈతకు వెళ్లి బాలుడి మృతి


