‘వైఎస్.. చెవిరెడ్డి’ కీ చైన్ల ఆవిష్కరణ
తిరుపతి రూరల్ : వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి చిత్రాలతో రూపొందించిన ప్రత్యేక కీ చైన్‌లను ఆదివారం తుమ్మలగుంటలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. రామచంద్రాపురం మండలం నడవలూరు సర్పంచ్ గణపతిరెడ్డి తయారు చేయించిన ఈ కీ చైన్‌లను చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డిల చేతులు మీదుగా విడుదల చేశారు. కార్యక్రమంలో లింగేశ్వర నగర్ సర్పంచ్ కోటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ నేతలు ఒంటెల శేఖర్, తులసీరామిరెడ్డి, ధరణీకుమార్‌రెడ్డి, యశ్వంత్‌రెడ్డి, లక్ష్మీప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.


