రూపకర్తలు వీరే..
పీఎస్‌ఎల్‌వీ రాకెట్ తయారు చేయడానికి ఎంతో మంది అనాటి యువ ఇంజినీర్లు శ్రమించినప్పటికి ముగ్గురు శాస్త్రవేత్తల పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తాయి. నంబి నారాయణన్, డాక్టర్ ఎస్.శ్రీనివాసన్, ఈకే మాధవన్ నాయర్ కృషి ఫలితమే పీఎస్‌ఎల్‌వీ అని చెప్పొచ్చు. ఈ రాకెట్లుకు ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఈకే మాధవన్ నాయర్ పనిచేశారు. అందులో ఎస్.శ్రీనివాసన్ అనే శాస్త్రవేత్త 1994లో జూన్ నుంచి అక్టోబర్ వరకు షార్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. నంబి నారాయణన్ మాత్రం ద్రవ ఇంధనం తయారు చేసిన శాస్త్రవేత్తగా చరిత్రలో నిలిచిపోయారు. 1988లో యువ శాస్త్రవేత్తలుగా వీరు పీఎస్‌ఎల్‌వీ ద్రవ ఇంధన దశల మీద ఎన్నో ప్రయోగాత్మక పరీక్షలు చేసి విజయం సాధించారు. ద్రవ ఇంధన ఇంజిన్ తయారు చేసుకుంటే భవిష్యత్‌లో అత్యంత బరువైన ఉపగ్రహాలను పంపించే సామర్థ్యం వస్తుందని నంబి నారాయణన్ ఆధ్వర్యంలో పారిస్‌లో శిక్షణకు వెళ్లారు. ఆయన అభివృద్ధి చేసిన ద్రవ ఇంజిన్లనే ఈనాటికీ ప్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం శాస్త్రవేత్తలు వాడుతుండడం విశేషం.
శాస్త్రవేత్త
ఎస్. శ్రీనివాసన్
శాస్త్రవేత్త
ఈకే మాధవన్ నాయర్
శాస్త్రవేత్త
నంబి నారాయణన్
రూపకర్తలు వీరే..
రూపకర్తలు వీరే..


