చోరీ కేసులో నిందితుడి అరెస్టు
నాయుడుపేట టౌన్: మేనకూరులోని ఓ ఇంట్లో జరిగిన చోరీకి సంబంధించి నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లు సీఐ బాబి తెలిపారు. అర్భన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఈ వివరాలను వెల్లడించారు. తేదీన మేనకూరు గ్రామానికి చెందిన ఉమామహేశ్వరి ఈ నెల 7వ తేదీన ఇంట్లో లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి చోరీ చేశారు. ఈ కేసుకు సంబంధించి శనివారం నిందితుడు మేనకూరు గ్రామానికి చెందిన కుంచెల దశరథరామయ్య అలియాస్ దశయ్యను ఎస్‌ఐ భానుప్రసన్న పట్టణంలోని గాంధీ పార్కు సమీపంలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అతడి వద్ద నుంచి సుమారు 28 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
బ్రహ్మర్షి ఆశ్రమాన్ని సందర్శించిన సీఆర్‌పీఎఫ్ డీజీపీ
రామచంద్రాపురం: కేంద్ర సీఆర్పీఎఫ్ డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ దంపతులు శనివారం రామచంద్రాపురం మండలం సి. రామాపురం సమీపంలోని బ్రహ్మర్షి గురూజీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమ ప్రాంగణంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, జైన్ దేవాలయాలలో స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు డీజీపీ దంపతులను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు.
చోరీ కేసులో నిందితుడి అరెస్టు


