సీనియర్ జర్నలిస్టుల పెన్షన్ మంజూరుకు కృషి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: దేశవ్యాప్తంగా వెటరన్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ సాధన కోసం తన వంతు కృషి చేస్తానని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెలగురుమూర్తి హామీ ఇచ్చారు. శనివారం తిరుపతిలోని ఆయ న కార్యాలయంలో సీనియర్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఏపీ వెటరన్ జర్నలిస్టు అసోసియేషన్ నా యకులు కలసి ఎంపీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ అందజేస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించి రాబోయే పా ర్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో జర్నలిస్టుల సమస్య లు సభ దృష్టికి తీసుకెళ్లి పరిష్కా రానికి కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘం నేత లు టి.జనార్దన్, ఎం.నరేంద్రరెడ్డి, ఆర్.చంద్రశేఖర్, పీవీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


