మల్లంగుంట ప్రాథమిక పాఠశాలలో ఘర్షణ
తిరుపతి రూరల్:మండలంలోని మల్లంగుంట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునికి విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య శుక్రవారం సాయంత్రం జరిగిన ఘర్షణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు కథనం మేరకు.. మల్లంగుంట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తు న్న మధుసూదన్‌రాజు తరగతి గదిలో విద్యార్థినులతో అసభ్యకరంగా వ్యవహరించడమే కాకుండా దూషిస్తు న్నారని విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన్ని నిలదీశారు. ఒక దశలో ఆయనపై చేయి చేసుకునే పరిస్థితి వచ్చినప్పటికీ శాంతించిన తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పు చేస్తే తమకు చెప్పాలని, చావమని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ప్రధానోపాధ్యాయుడిని వివరణ కోరగా బాగా చదివే పిల్లలు తక్కువ మార్కులు తెచ్చుకున్నారన్న బాధతో దూషించానే తప్ప వారిని బాధపెట్టలేదని చెప్పినా తల్లిదండ్రులు వినిపించు కోలేదన్నారు.


