మహిళా దొంగ అరెస్టు
తిరుపతి క్రైం: మత్తు మందు ఇచ్చి బంగారు తాళి బొట్టు చోరీ చేసిన మహిళను తిరుమల వన్ టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వన్‌టౌన్ ఎస్‌ఐ చలపతి కథనం మేరకు.. తిరుపతిలోని ము న్సిపల్ ఆఫీస్ వెనుక భాగంలో నివాసముంటున్న తిరుపతి రాధాకృష్ణ విజయ(63) ఈ నెల రెండో తేదీన తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూలోకి వె ళ్లింది. మూడో తేదీ వేకువజామున రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉండగా ఓ గుర్తు తెలియని మహిళ బాధితులకు మత్తుమాత్రలు ఇచ్చి, ఆమె మెడలో ఉన్న 60 గ్రాములు బంగారు తాళిబొట్టు చైను దోచుకుని వెళ్లింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, సాంకేతిక విశ్లేషణ, సీసీ కెమెరాలు ద్వారా పరిశీలించి క ర్ణాటకకు చెందిన నాగిశెట్టి రత్నమ్మ (45)ను తిరుమలలో అరెస్టు చేస్తామన్నారు. ఆమె వద్ద నుంచి సుమారు 57 గ్రాములు బరువు కలిగిన బంగారు తాళిబొట్టు చేను స్వాధీనం చేసుకున్నామన్నారు.


